ఈ మధ్య కాలంలో భార్యభర్తల హత్యలు కలవరపెడుతున్నాయి. ప్రియుడు కోసం భార్యలు భర్తను కడతేర్చుతున్న ఘటనలు ఎక్కువవుతున్నాయి. అదే సమయంలో అనుమానంతో పాటు చిన్న చిన్న విషయాలకే భర్తలు భార్యలను కిరాతకంగా చంపుతున్న ఘటనలు ఆందోళన కలిగిస్తున్నాయి. ఇటీవలే మేడ్చల్ జిల్లాలో మద్యం మత్తులో ఓ వ్యక్తి భార్యను దారుణంగా చంపి ముక్కలు చేశాడు. ఈ ఘటన మరవక ముందే హైదరాబాద్‌లో మరో దారుణ ఘటన వెలుగులోకి వచ్చింది. అనుమానంతో ఓ భర్త తన భార్యను కత్తితో గొంతు కోసి దారుణంగా హత్య చేశాడు. ఈ ఘటన కుషాయిగూడ పోలీస్ స్టేషన్ పరిధిలోని ఏఎస్‌రావు నగర్ అనుపురం కాలనీలో జరిగింది.

