విశాఖలో షాపుల తొలగింపుపై వైసీపీ ఆగ్రహం

విశాఖలో జీవీఎంసీ అధికారులు రోడ్డు పక్కన ఉన్న బడ్డీలు, తోపుడు బండ్లను నోటీసులు లేకుండా తొలగించడాన్ని వైసీపీ విశాఖ జిల్లా అధ్యక్షుడు కె. కె రాజు శనివారం తీవ్రంగా ఖండించారు. ఈ చర్యను అడ్డుకునేందుకు ఆయన స్థానికులతో కలిసి శనివారం సీతమ్మధారలోని ఎస్ఎఫ్ఎస్ పాఠశాల వద్ద నిరసన తెలిపారు. చిరు వ్యాపారుల కడుపు కొట్టే ప్రభుత్వ నిర్ణయాన్ని వెంటనే వెనక్కి తీసుకోవాలని, లేదంటే పోరాటం తప్పదని ఆయన హెచ్చరించారు.

Continue Reading

విశాఖ: రోడ్డుకు అడ్డంగా కారు… ట్రాఫిక్ ఇబ్బందులు

విశాఖపట్నంలోని ఫోర్త్ టౌన్ పోలీస్ స్టేషన్ సమీపంలో శనివారం రాత్రి ఒక బీజేపీ నాయకుడి కారు రోడ్డు మధ్యలో ఆగిపోవడంతో వాహనాల రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. దీనివల్ల అటుగా వెళ్తున్న వాహనాలు నిలిచిపోయి, ట్రాఫిక్ స్తంభించింది. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని, కారు యజమాని గురించి ఆరా తీశారు. పోలీసులు కారును తొలగించేంత వరకు వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు.

Continue Reading

లోకేష్ ఫౌండేషన్ ఆర్థిక సాయం

లోకేష్ ప్రజాశక్తి ఫౌండేషన్ రాష్ట్ర వ్యాప్తంగా సేవా కార్యక్రమాలు చేపడుతోంది. ప్రతి జిల్లాలో సమస్యలను గుర్తించి, ఫౌండేషన్ అధ్యక్షులు చదరం తులసి రామ్ పరిశీలించి, టీంతో చర్చించి కార్యక్రమాలకు శ్రీకారం చుడుతున్నారు. ఈ క్రమంలో విశాఖ జిల్లా గాజువాక నియోజకవర్గంలో, రాష్ట్ర ఫౌండేషన్ కోఆర్డినేటర్ గోపిశెట్టి గోపి సమాచారం మేరకు, పక్షవాతంతో బాధపడుతున్న తెలుగుదేశం పార్టీ సీనియర్ కార్యకర్త అవతార్ గారికి ఫౌండేషన్ ద్వారా ఆర్థిక సాయం అందజేశారు.

Continue Reading

గాజువాక: చిరువ్యాపారుల పొట్టకొట్టొద్దు

గాజువాకలో రోడ్డు పక్కన వ్యాపారం చేసుకుంటున్న చిరు వ్యాపారుల బడ్డీలు, తోపుడు బండ్లను ఎలాంటి ముందస్తు నోటీసులు ఇవ్వకుండా తొలగించడం అన్యాయమని గాజువాక హాకర్ సంక్షేమ సంఘం గౌరవ అధ్యక్షులు కసిరెడ్డి సత్యనారాయణ ఆందోళన వ్యక్తం చేశారు. ఆదివారం కొత్త గాజువాకలో జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఈ చర్య వల్ల చిరు వ్యాపారులు రోడ్డున పడ్డారని అన్నారు. చిరు వ్యాపారులను అదే స్థలంలో వ్యాపారం చేసుకునేందుకు అనుమతించాలని ఆయన డిమాండ్ చేశారు.

Continue Reading

Watch Video: ఇవే తగ్గించుకుంటే మంచిది.. ఫుట్‌పాత్‌పై ప్రమాదకర స్టంట్స్‌.. చివరకు ఏమైందో చూడండి!

ఎవడైనా బైక్‌పై స్టంట్స్ చేస్తూ.. ట్రాఫిక్ నియమాలను ఉల్లంఘిస్తూ వేగంగా దూసుకెళ్తే.. జనాలు ఏమనుకుంటారు. జాగ్రత్త రరేయ్‌ పడితే పళ్లు రాలుతాయ్‌ అంటారు. తాజాగా సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతున్న ఒక వీడియోలో కూడా అచ్చం అలాంటి ఘటనే జరిగింది. ట్రాఫిక్ నియమాలను ఉల్లంఘిస్తూ ఇద్దరు బైకర్లు ఫుట్‌పాత్‌పై వేగంగా దూసుకెళ్లారు. ఇందుకు సంబంధించిన వైరల్‌ అయిన తర్వాత ఈ బైకర్స్‌ తీరుపై జనాలు ఆగ్రహం వ్యక్తం చేశారు. కానీ తర్వాత జరిగింది చూసి వాళ్లంత సంతృతప్తి […]

Continue Reading

Brain Eating Amoeba: వేగంగా వ్యాపిస్తున్న మెదడు తినే అమీబా కేసులు.. 19 మంది మృతి! దీని లక్షణాలు

బెంగళూరు, సెప్టెంబర్ 21: మెదడున తినే అమీబా వ్యాధి కేరళలో వేగంగా వ్యాపిస్తోంది. ఈ ఇన్ఫెక్షన్ కారణంగా ఇప్పటికే 19 మంది మరణించారు. మరణాల సంఖ్య అక్కడ వేగంగా పెరుగుతుందటంతో ఆందోళన నెలకొంది. కేరళ రాష్ట్రంలో అమీబా ఇన్ఫెక్షన్ కేసులు వెలుగులోకి వచ్చిన తర్వాత ఆ రాష్ట్రం ఇరుగుపొరుగు రాష్ట్రాలు అప్రమత్తం అయ్యాయి. హై అలర్ట్‌ జారీ చేశాయి. ఈ ఇన్ఫెక్షన్ ఎలా వ్యాపిస్తుందో, దాని లక్షణాలు ఏమిటో ఇక్కడ తెలుసుకుందాం..

Continue Reading

English-Speaking Village: మన దేశంలో ఈ గ్రామం వెరీ వేరే స్పెషల్.. ప్రతి ఇంట్లో ఒక ఇంగ్లీష్ టీచర్..

పశ్చిమ బెంగాల్‌లోని మాల్డా జిల్లా సోషల్ మీడియాలో చాలా ప్రసిద్ధి చెందింది. దీనికి ప్రధాన కారణం ఆ గ్రామంలో ఇంగ్లీషు భాషకు ఉన్న ఆదరణ. అవును ఈ చిన్న గ్రామంలో వీధుల్లో ఆడుకునే పిల్లల నుంచి వృద్ధుల వరకు అందరూ ఇంగ్లీష్ అనర్గళంగా మాట్లాడతారు. ఈ గ్రామంలో ఎక్కడ ఎక్కడ చూసినా IELTS (ఇంటర్నేషనల్ ఇంగ్లీష్ లాంగ్వేజ్ టెస్టింగ్ సిస్టమ్) పరీక్షకు సిద్ధమవుతున్న వారే కనిపిస్తారు. అంతేకాదు దీని కోసం ఇక్కడ చాలా కోచింగ్ సెంటర్లు ఉన్నాయి. […]

Continue Reading

PM Modi: సెప్టెంబరు 22 నుంచి GST ఉత్సవ్‌.. ప్రధాని చెప్పిన టాప్ 9 పాయింట్స్ ఇవే..

 సెప్టెంబరు 22 నుంచి GST ఉత్సవ్‌ ప్రారంభం కాబోతోందన్నారు ప్రధాని మోదీ. కొత్త చరిత్ర మొదలవుతోందన్నారు. తదుపరి తరం GST సంస్కరణలు అమల్లోకి వస్తున్నాయన్నారు. GST సంస్కరణలు విప్లవాత్మకం అన్నారు ప్రధాని మోదీ. సెప్టెంబర్‌ 22 నుంచి GSTలో మార్పులు అమల్లోకి రానున్న నేపథ్యంలో జాతినుద్దేశించి ప్రసంగించారు. GST తగ్గింపు వల్ల పేదలు, మధ్యతరగతికి ఎంతో మేలు జరుగుతుందన్నారు ప్రధాని. ఈ మార్పులు రాష్ట్రాల అభివృద్ధికి దోహదం చేస్తాయన్నారు. ఉత్పత్తిదారులకు, వినియోగదారులకు ప్రయోజనం కలుగుతుందన్నారు. GST సంస్కరణలు […]

Continue Reading