విశాఖలో జీవీఎంసీ అధికారులు రోడ్డు పక్కన ఉన్న బడ్డీలు, తోపుడు బండ్లను నోటీసులు లేకుండా తొలగించడాన్ని వైసీపీ విశాఖ జిల్లా అధ్యక్షుడు కె. కె రాజు శనివారం తీవ్రంగా ఖండించారు. ఈ చర్యను అడ్డుకునేందుకు ఆయన స్థానికులతో కలిసి శనివారం సీతమ్మధారలోని ఎస్ఎఫ్ఎస్ పాఠశాల వద్ద నిరసన తెలిపారు. చిరు వ్యాపారుల కడుపు కొట్టే ప్రభుత్వ నిర్ణయాన్ని వెంటనే వెనక్కి తీసుకోవాలని, లేదంటే పోరాటం తప్పదని ఆయన హెచ్చరించారు.

