హైదరాబాద్‌లో హైడ్రా కూల్చివేతలు మరోసారి హాట్‌టాపిక్‌గా మారాయి. గాజులరామారంలో హైడ్రా కూల్చివేతలు హైటెన్షన్‌కు దారితీశాయి.. దీంతో గాజులరామారంలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. హైడ్రా కూల్చివేతలను వ్యతిరేకిస్తూ స్థానికులు ఆందోళన చేపట్టారు. ఇళ్ల కూల్చివేతలపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్న బాధితులు.. తాము కొనుక్కున్న ఇళ్లను కూల్చవద్దని వేడుకున్నారు. బతుకమ్మ పండుగ వేళ ఇళ్లను కూల్చివేయడంపై ఆవేదన వ్యక్తంచేశారు. జేసీబీలను అడ్డుకుని ధర్నాకు దిగిన గాజులరామారం బాధితులు.. ఇళ్లను అమ్మినవారిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. బతుకమ్మ పండుగ వేళ ఇళ్లను కూల్చివేయడంపై బాధితులు కన్నీటి పర్యంతమయ్యారు. హైడ్రా కూల్చివేతల ప్రాంతంలో బతుకమ్మ ఆడుతూ నిరసన తెలిపారు.

